Saturday 20 December 2014

tel story." production controller". read, understand and entertain the soul with different economic values. 'ప్రొడక్షన్ కంట్రోలర్'-భట్ సాధన

tel story." production controller". read, understand and entertain the soul  with different economic values. 'ప్రొడక్షన్ కంట్రోలర్'-భట్ సాధన








'ఉత్పత్తి కారకాలు యేవి?'-
'భూమిశ్రమమూలధనంనిర్వాహణ.'
'వినియోగం అనగా నీకేమి తెలియును?'
'........'
పరీక్షలు అనుకుంటా;మాస్టారి సంతానం చదువుకుంటున్నారు.రోజూ సాయంత్రం నాకు  పిల్లలతో కాలక్షేపం చేయడం అలవాటైపోయిందిఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయి ఆరు నెలలు దాటింది.పిల్లలు చదువుతున్న యెకనామిక్స్ ఫండమెంటల్స్ జవాబులు వినిమా ఆఫీసులో బాతాఖానీ గుర్తుకువచ్చింది.
"వస్తూత్పత్తి అంతా వినియోగదారుడి వాడకంయింకా సంతృప్తి కోసమే జరుగుతోంది..."-అంటే నాకు దేనితో నవ్వాలో తోచటంలేదు.-అన్నారు పెక్స్-యెన్సీ గారు.
"యేం జరిగింది యేమిటిమీ మరదలి పెళ్ళి పనులు యెంతవరకూ వచ్చాయ్?!"-కళ్ళు తిప్పుకుంటూ అన్నారు టైపిస్టు మంగతాయారు గారు.
"అదే పెళ్ళి సరంజామా కోసమే బజారు పోయిఅటు నుంచి అటు ఫంక్షన్ హాల్ మాట్లాడి వస్తున్నాబిఫోర్ నూన్ అవర్సు పర్మిట్ పెట్టి;"
"సెలవులు మరీ యెక్కువగా వాడుకోరు మీరు యెంచక్కా."
"అవును -నేను ఫ్రెష్షు గా ఒక గిన్నీసు బుక్ కొనుక్కొనిదాన్లో నా పేరు కూడా చెక్కుకున్నా మేడమ్ దీని గురించే..."
"అది సరే మీరు యెకనామిక్సు డాక్టరేటు కదాఅస్సలు ప్రొడక్షను కన్ స్యూమరు కోసమే కాదంటారా ఏమిటికొంపదీసి!"-అన్నాను నేనుసంభాషణని పనికొచ్చేదిశగా   మెటీరియలైజ్ చేద్దామని...
"డాక్టరేటు అయితే మటుకూ,   యా విషయాల మీద పరిశీలన చేసిపట్టా పొందాక కూడా వాటిపై అనుమానాలు రావడంఅవి తగినంత కలవరపెట్టడంతన వ్యక్తిగత అభిప్రాయాలని మాత్రమే పైకి చెప్పకుండా మౌనంగారహాస్యంగా మార్చుకోవడం జరగదంటారా?!"- అన్నారు పెక్స్ యెన్సీ గారు గంభీరంగా.
"వెనకటికి ఒక శాస్త్రవేత్తని -'మీకు ఫస్ట్ డాక్టరేటు యే సబ్జక్ట్ మీదవచ్చిందీ-అంటే-నాకైతే గుర్తు లేదుమా సబార్టినేటుని అడగండీ... ' -అన్నాట్ట అల్లాగుందీ ఇది."-అన్నాను నేను.                                      " సబార్టినేటు జవాబేమిటో?!"-కొత్త యూడీసీ  తన డౌటున్నర వ్యక్తం చేశాడు.
"యేమో నాకు మటుకూ యేం గుర్తూబహుశా సైకాలజీలో మెమోరీ గురించి అనుకుంటా...-అన్నాట్ట."
"ఇంతకీ మీ మరదలి పెళ్ళి పనులు గురించి చెప్పడంపూర్తి చేశారు కాదు."-మంగ తాయారు గారు తిరిగి అడగడంతో:
"  అక్కడికే వస్తున్నాఅదే పంక్షన్ హాల్ వాడు యిరవైనాలుగు గంటలకు మించి ఒక్క నిమిషం కూడా ఇవ్వనంటాడుసరే వొప్పుకున్నాను.అన్ని వస్తువులు తీసుకోవడం అయ్యిందిరాబోయేది నడి వేసవి కదా-
అని కుండలు బేరమడుదామని వెళ్ళాను.
"యీ రెండొందల కుండలు ఆల్ రెడీ బుక్ అయిపోయాయి సార్.మీకొసం కొత్తగా తయారు చేయించాలి సార్."-అన్నడు కుమ్మరివాడు.-యెవరయ్యా బుక్ చేసిందీ అంటే-"సినిమా స్టూడియో వాళ్ళు మాట్లాడుకున్నారు సార్."అతని మాటల్లో గర్వం కూడా కనపడింది.
"కొన్నింటికి రంగులేసిడాన్స్ కి వాడుతారుఇన్నెందుకయ్యా"-అంటే-
'స్టంట్ సీన్ షూటింగు కండీ'-అక్కడే ఉన్న స్టుడియో మనిషి అన్నాడుకుండలతనికి డబ్బిస్తూచాలా విసురుగావిలాసంగా  తన మోటర్ స్టార్ట్ చేసివెళ్ళిపోయాడు.
"ఓహోయెవరండీ వారు?"-ఆసక్తిగా అడిగాను.
"ప్రొడక్షన్ కంట్రోలర్"-అదీ ఆన్సరు.
" సీ-అదేం న్యాయం బాబూ?!"
"సినిమాలు లేకపొతే యెల్లా సార్!"అన్నాడు  కుండలని వాన్ మీదికి యెక్కిస్తూ సర్దిస్తూ ఉన్న మనిషి.
"మరి భగీరధ ప్రయత్నలు యెమీ చేయలేదా?"-మళ్ళీ  అసలు టాపిక్ పెళ్ళి ప్రయత్నాలు గుర్తొచ్చి;
" తర్వాత నీళ్ళ కోసం మునిసిపల్ వాటర్ వర్క్స్ కి పెద్ద రికమండేషన్ తో వెళ్ళాను.-'టాంకరులన్నీ స్టూడియోలకి తోలేశాంయెల్లుండి ఓసారి మళ్ళీ కలవండి'-అన్నాడు అక్కడి ఆఫీసరు."
"లవ్ సాంగ్సుమళ్ళీ బురద లో స్టంట్ సీన్సు షూటింగ్సు కి పంపెశారన్నమాట యీ నీళ్ళ టాంకరులన్నీ..."-అన్నాను వుక్రోషంగా..
"కూరల బజారుకి వెళ్ళలేదా?!"-మంగతయారు గారు తన లంచ్ బాక్సు బాగ్ లోకి సర్దేస్తూ...
"అక్కడే మన యెకనామిక్సు ఫిలాసఫీ మార్పులకి గురైయ్యింది"-అన్నారు శ్రి పెక్స్ యెన్సీ...
"అక్కడేం యెదురైయ్యింది?!"-నా సబ్జెక్టు యాంగ్జైటీ నాదీ.
"కూరల బజారు మొత్తం యెవరూ లేరు.వాటి ఉత్పత్తిదార్లు సరేఅటు వర్తకులూవినియోగదార్లూ యెమైయ్యారైయ్యా అంటే, -










"కూరల మర్కెట్ అంతా సినిమా స్టూడియోలకి వెళ్ళిపోయింది సార్."-అన్నాడు ఒక కుంటి బిచ్చగాడు నా వెర్రీ మొహం చూసి.
కింద పడ్డ కూరగాయల అవశేషాలని 'అచ్చోసినవో,కావో"-గానీ 'ఆమంబాపతు'-ఆంబోతులు తింటున్నాయి ప్రశాంతంగా...
'యెందుకని?'- అని అడగలేదుఅది కూడా స్టంట్ సీను షూటింగ్ కోసమేనని అర్ధం చేసుకొని.
"అవును యిప్పుడు సినిమాలన్నిటిలోనూ :సూపర్ బజార్లో స్టంట్లూకూరల మార్కెట్లో స్టంట్లూఅదెదో సినిమాలో బోలెడన్ని టీవీలూ,మెడికల్ షాపులు పగలేసుకుంటారుమనం చూడట్లేదా డ్యూయెట్లూలవ్ సాంగ్సులో కూడా బాంబులు పెలుస్తున్నారు.






ఒక్కో టటా సూమో గాల్లోకి యెగిరి,  మూడు సార్లు కింద పడుతోంది మరి."నాకు చిన్నప్పటినించీ ఒక అనుమానం: 'ప్రొడక్షన్ కంట్రోలర్- 'యీ సినిమాలల్లో యేంచేస్తాడా'-అని.ఈనాటికి అర్ధం అయ్యిందిసెన్సు కూడా రివిజన్ అవుతూ వుంటుంది;మనం కానిస్తే..."
"కుండలుకూరలూనీళ్ళూ...యేవైనా సరే... వీటిలో వినియోగదారుల జీవితావసరాల  కోసం యెంతవరకూ వుత్పత్తి అవుతున్నాయీ?!,వినియోగింపబడుతున్నాయీ?!, సంతృప్తి నిస్తున్నయీ?!, చెప్పండీ..."అన్నారు చాలా మటుకూ అవెశంతో పెక్స్ యెన్సీ గారు.
నాకైతే ప్రొడక్షన్ కంట్రోలర్, 'ఉత్పత్తి పెంచండీ..' అని ప్రొత్సహించే మహాత్ములూ, 'ధరలు తగ్గించండీనిత్య జీవితవసరాలు అందరికీ అందనీయండీ'-అనే నిస్వార్ధ వుద్యమదారులూ...అంతా గుర్తుకొచ్చారుఅయినాకానీ...
" కూరగయలనీకుండలనీ,నీళ్ళనీ...అన్నిటినీ....సినిమాల ద్వారా అనుభవించే వారుపాపం సగటు సినీ ప్రేక్షకులేకదా..."అనేశాను.
అల్లా అన్నానే కానీనా లాజిక్ కి నేనే నాలిక కరుచుకున్నానుఅందుకే ననుకుంటా:  వేదాంతులు మూర్ఖూడి కేసి చూసినట్లు చూశారంతా.
...మాస్టారి పాపాయి ఉమ నన్ను భుజాలు కుదుపుతూ యిహ లోకం లోకి తీసుకొచ్చింది.
"అంకుల్మురళీ రెడ్ కాయిన్ కొట్టాడు;సపోర్టుగా ఫాలో ఆన్ కాయిన్ ఇంకోటి కొట్టాలి కదూచూడండీనన్ను అడేశేయమంటున్నాడు..."
"అవును మురళీనువ్వు ఫాలో ఆన్ కొట్టాలిసిందే..."
-అన్నాను నేను
@@@. 

No comments:

Post a Comment